బిగ్ బాస్ ఫేం సోహెల్ అనంతపురంలో సందడి చేశాడు. వేణుగోపాల్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నాడు. పాఠశాల యజమాని తమ కుటుంబానికి దూరపు బంధువు కావడంతో వారి ఆహ్వానం మేరకు వేడుకలకు వచ్చినట్లు తెలిపాడు . విద్యార్థులతో కలిసి కాసేపు సందడి చేశాడు. అతనితో సెల్ఫీ దిగడానికి విద్యార్థులు పోటీ పడ్డారు.
ఇదీ చదవండి: స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలి: బాలకృష్ణ