అనంతపురం జిల్లాలో ఇటీవల చెదురుముదురు వర్షాలు పడటంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. కళ్యాణదుర్గం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ భూగర్భ జలాలు, భూసారాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. బ్రహ్మసముద్రం, కంబదూరు, శెట్టూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం మండలాల్లో ఆర్డిటి సంస్థ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు, ఎకాలజీ ఎస్టీఎల్ నరసింహులు తమ సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పలువురు రైతులు పాల్గొన్నారు. భూసారాన్ని పెంచి గ్రామీణ పేద రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఇది చదవండి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం