మహిళపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురిపై దాడి చేయటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇదే గ్రామంలో గత నెలలో కర్రెన్న అనే రైతుపై, నాలుగు రోజుల క్రితం సుదర్శన్ అనే యువకుడిపై ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర