బ్యాంకులో రుణం తీసుకుని పూర్తిగా చెల్లించినా తమ భూమి పత్రాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అనంతపురంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న పాత సిండికేట్ బ్యాంక్ (ప్రస్తుతం కెనరా బ్యాంకు)లో రాయదుర్గం ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు.
ఏళ్లు గడుస్తున్నా..
రుణాలు చెల్లించి రెండు ఏళ్లు గడుస్తున్నా తమకు బ్యాంకు అధికారులు భూ పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్య.క్తం చేశారు. బ్యాంక్ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అనంతపురం సిండికేట్ బ్యాంకు అధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.