అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం సర్సంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ (30) అనే వ్యక్తి మతి చెందాడు. బ్యాంకు ఉద్యోగి అయిన ఆ వ్యక్తి దివ్యాంగుడు. అతను బత్తలపల్లి నుంచి తన త్రిచక్ర వాహనంపై విధులకు హాజరయ్యేందుకు.. నర్సంపల్లిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు ప్రయాణిస్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టగా.. ప్రమాదం జరిగింది.
మృతుడు ఆనంద్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగరీత్యా అతడు బత్తలపల్లి లో నివాసం ఉన్నాడు. దివ్యాంగుడు అయిన కారణంగా.. మూడు చక్రాల వాహనంలో బ్యాంకు విధులకు వెళ్లి వస్తుండేవాడని తెలుస్తోంది. ఆనంద్ మృతిపై బ్యాంకు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: