ETV Bharat / state

సీఎం జగన్ అవినీతిపై సినిమా తీయెచ్చు: బండారు

సీఎం జగన్మోహన్​రెడ్డి అవినీతి మీద "అలా అవినీతిపురం" అని పేరు పెట్టి సినిమా తీయోచ్చని తెదేపా నేత బండారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పేదలకు పంపిణీ చేస్తున్న 31 లక్షలు ఇళ్లు ఎక్కడ ఇస్తున్నారో మంత్రి బొత్స సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం జగన్ అవినీతిపై సినిమా తీయెచ్చు
సీఎం జగన్ అవినీతిపై సినిమా తీయెచ్చు
author img

By

Published : Dec 28, 2020, 7:11 PM IST

పేదలకు పంపిణీ చేస్తున్న 31 లక్షలు ఇళ్లు ఎక్కడ ఇస్తున్నారో మంత్రి బొత్స సమాధానం చెప్పాలని తెదేపా సినీయర్ నేత బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.

"ఏ భూములు ఇస్తున్నారో మంత్రి బొత్స తెలపాలి. ఆ స్థలాలు కోసం తవ్విన మట్టి ఎక్కడికి పంపారో చెప్పాలి. పట్టా భూముల్లో చదును చేసి రోడ్లు వేశారు. వాటికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి. న్యాయస్థానాల్లో ఉన్న భూములను భూ సమీకరణ కింద ఏ విధంగా సమీకరించారు. దాని కోసం ఎన్ ఏ యాక్ట్ అనుసరించారా?."-బండారు సత్యనారాయణ

ఇళ్ల పట్టాల కార్యక్రమానికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని ఆ అంశంపై, ఆ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. తాను మాట్లాడింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండారు స్పష్టం చేశారు.

జగన్మోహన్​రెడ్డి అవినీతి మీద "అలా అవినీతిపురం" అని పేరు పెట్టి సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. సినిమాలో సీఎం జగన్ పాత్ర తాను పోషిస్తానని బండారు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.