అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. వైకాపా హవాలోనూ హిందూపురం నుంచి రెండో సారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బాలకృష్ణకు చిలమత్తూరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన సతీమణి వసుంధరతో కలసి చిలమత్తూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు, నాయకుల నడుమ కేక్ కట్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. తనను హిందూపురం నుంచి మరోసారి గెలిపించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బాలయ్య అన్నారు.
నందమూరి తారకరామునికి నటసింహం నివాళి - hindupuram
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరాముని 96వ జయంతి వేడుకల్లో ఆయన తనయుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలు చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. వైకాపా హవాలోనూ హిందూపురం నుంచి రెండో సారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బాలకృష్ణకు చిలమత్తూరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన సతీమణి వసుంధరతో కలసి చిలమత్తూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు, నాయకుల నడుమ కేక్ కట్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. తనను హిందూపురం నుంచి మరోసారి గెలిపించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బాలయ్య అన్నారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలు కర్నూల్ లో నిర్వహించారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను తెదేపా నాయకులు అభిమానులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలను కొనియాడారు
బైట్... బంగి ఆనంతయ్య. టీడీపీ నాయకుడు.
Body:ap_knl_11_28_ntr_jayanthi_ab_c1
Conclusion:ap_knl_11_28_ntr_jayanthi_ab_c1