సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయమూర్తి రాధాకృష్ణమూర్తి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కోర్టు ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుట్టబోయేది అమ్మాయి అని తెలిసి అత్తా, మామలు కోడలును ఇంటి నుంచి బయటకు పంపిన ఘటన ఓ పత్రికలో చదివినట్లు తెలిపారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండ ఉండేందుకే ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తమ వద్దకు వచ్చే ప్రతి మహిళకు చట్టాల గురించి తెలిపి వారిలో ఆత్మస్థైర్యం నింపుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చట్టాలపై మహిళలకు అవగాహన