అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పులికల్లు సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మల్లికార్జున పల్లి నుంచి నరసాపురం వైపు కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల్లో రైతులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వీరిని అనంతపురం తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!