అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. 42వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో.. నగదు చోరీ చేయడానికి దుండగులు తీవ్రంగా ప్రయత్నించారు. అర్ధరాత్రి సమయంలో చొరబడి ఏటీఎం మిషన్ని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లాలనుకున్నారు. కానీ ఏటీఎం తెరుచుకోకపోవడంతో రోడ్డుపైనే పడేసి... పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదంవడి: అద్దె కోసం యజమాని వేధింపులు.. భరించలేక వ్యక్తి ఆత్మహత్య