తల్లి మరణ వార్త విన్న కుమారుడూ. హఠాత్తుగా కుప్పకూలిపోయారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు(ASI Venkataswamy died). అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపారు.
మరోవైపు వెంకటస్వామి తల్లి కోన్నమ్మ(70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. తల్లి ఆరోగ్యం గురించి దిగులుపడుతూనే ఆయన కుమారుడి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన కాసేపటికే కోన్నమ్మ ఆసుపత్రిలో మరణించారు. విషయాన్ని బంధువులు ఫోన్‌లో వెంకటస్వామికి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
ఇదీ చదవండి..
Crime news: విశాఖలో దారుణం.. బంగారం, డబ్బుకోసం వృద్ధురాలి హత్య