అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉరుము కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉరుము కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఉరుము కులం వారు తమ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న... ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 2 వేలమందికిపైగా ఉరుము కళాకారులు ఉన్నామని ప్రధాన కార్యదర్శి వన్నూరప్ప తెలిపారు. జిల్లావ్యాప్తంగా జీపు యాత్ర ద్వారా ఉరుము కళాకారులను చైతన్యం చేస్తూ ఏకతాటిపై తెస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి