ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధ్వంసకర రాజకీయాలతోనే రాష్ట్రంపై కేంద్రానికి చిన్నచూపు అని అన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్. అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. పోలవరం నిర్మాణంపై కేంద్రం మోసం చేస్తుంటే సీఎం ప్రశ్నించాల్సిందిపోయి, వేరొకరిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ రైతు కాకుండా ఓ వ్యాపారి కాబట్టే కేంద్ర వ్యవసాయ బిల్లుకు మద్దతు పలికారని ఆరోపించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలవరంపై సీఎం వెంటనే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చకు సిద్ధం కాకపోతే తామే ఆ బాధ్యత తీసుకుంటామని శైలజానాథ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి జగన్ సాగిలపడ్డారని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే.. కేంద్రం రాష్ట్రాన్ని అవమానించినా పట్టించుకోవటం లేదన్నారు. పులివెందుల పౌరుషం ఏమైంది జగన్ మోహన్ రెడ్డీ అంటూ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: 'అందుకే ఆగుతున్నాం.. లేకపోతే స్థానిక ఎన్నికలకు మేం సిద్ధం'