కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. కొవిడ్ కట్టడి కోసం ఒక్కో జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు కర్ఫ్యూతోపాటు లాక్‌డౌన్ సైతం విధించాలని డిమాండ్ చేశారు. సంక్షోభం కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతుండగా.. వారికి నెలకు రూ.7,500 ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా నిత్యవసర సరకులు పంపిణీ చేయాలన్నారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం
వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ పంపిణీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల మీద ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి.. కరోనా కట్టడి మీద లేదని విమర్శించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో.. ఉదయం 6 గంటల నుంచే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: