ETV Bharat / state

సర్పంచులపై వైకాపా ప్రభుత్వం కక్ష కట్టింది: ఏపీ సర్పంచుల సంఘం - వైకాపా ప్రభుత్వం సర్పంచులపై కక్ష కట్టింది

YCP Sarpanchs fire on AP govt: వైకాపా ప్రభుత్వం సర్పంచులపై కక్ష కట్టిందని.. రాష్ట్ర సర్పంచుల సంఘం ఆరోపించింది. సర్పంచులకు వ్యతిరేకంగా కార్యక్రమాలను చేసే బదులు.. ఏకంగా సర్పంచులు, ఎంపీటీసీల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయ్యొచ్చు కదా అని సర్పంచులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకోకపోతే, భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలు కూడా ఇదే పంథాని కొనసాగించే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

AP Sarpanches
వైకాపా ప్రభుత్వం సర్పంచులపై కక్ష కట్టింది
author img

By

Published : Dec 28, 2022, 5:03 PM IST

వైకాపా ప్రభుత్వం సర్పంచులపై కక్ష కట్టింది సర్పంచుల సంఘం

Ycp Sarpanches fire on AP govt: సర్పంచుల పదవీ కాలం ఐదేళ్లూ. ఈ ఐదేళ్లలో విద్యుత్తు ఛార్జీల బకాయిలే చెల్లిస్తే, ఇక గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని.. సర్పంచులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ నిరంకుశ, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యల కారణంగా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దయనీయ స్థితిలో సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల ఆధీనంలో పని చేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని ఓవైపు తాము పోరాటం చేస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ తరఫున గృహసారథులు, ఒక్కో సచివాలయం పరిధిలో ముగ్గురు చొప్పున కన్వీనర్లను నియమించడం ద్వారా గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. 'పంచాయతీల వరకే రాజకీయాలు చేద్దాం-సంఘం తరఫున రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం' అని నినదించారు.

విజయవాడలో నిర్వహించిన ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును సర్పంచులు తీవ్రంగా తప్పుపట్టారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను విద్యుత్‌ బిల్లుల పేరుతో లాగేసుకుంటున్న ప్రభుత్వం.. అనేక పోరాటాలు, ఆందోళనలు చేశాక నిధులను పంచాయతీల ఖాతాలకు వేసినట్లే వేసి.. క్లాప్‌ మిత్రలకు జీతాలు, సచివాలయాల నిర్వహణ పేరుతో వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఇంకో 6 వేల కోట్ల విద్యుత్​ ఛార్జీల బకాయిలు చెల్లించాల్సి ఉందని విద్యుత్తు పంపిణీ సంస్థలు చెబుతున్నాయని గుర్తు చేశారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి సీఎం జగన్‌ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

సమావేశంలో పలు తీర్మానాలను సర్పంచులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను గ్రామ పంచాయతీల పేరుతో విడుదల చేసి సర్పంచుల ద్వారా అభివృద్ధి పనులు చేయించాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాలతోపాటు వాలంటీర్లను పంచాయతీలు, సర్పంచుల ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. వీరు పంచాయతీలకు సమాంతర వ్యవస్థగా పని చేయడం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్‌ 243 జీవోకి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు కేటాయించాలని తీర్మానించారు. పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు అయ్యే విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. పాత బకాయిలు రూ.6 వేల కోట్లు రద్దు చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,660 కోట్లు గ్రామ పంచాయతీలకు తిరిగి కేటాయించాలని తేల్చి చెప్పారు.

సర్పంచులు, ఎంపీటీసీలకు రూ.15 వేలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సాధారణ నిధుల వినియోగంపై ఆంక్షలను ప్రభుత్వం తక్షణం ఎత్తివేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై పోరాడి తమ హక్కులను కాపాడుకుంటామని సర్పంచులు స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్‌లు ఎవరు కూడా విద్యుత్ బిల్లులు కట్టవద్దని, క్లాప్‌ మిత్రలకు జీతాలు ఇవ్వొద్దని సర్పంచ్‌ల సంఘం, రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున గృహసారథులను, ఒక్కో సచివాలయం పరిధిలో ముగ్గురు చొప్పున కన్వీనర్లను పార్టీపరంగానూ, ప్రభుత్వపరంగానూ నియమించింది. ఈ వాలంటీర్ల, సచివాలయాల వల్ల మా పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలు అయిపోయారు. పూర్తిగా పంచాయతీ రాజ్ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దీంతో సర్పంచ్‌లు బొడ్డు రాయికంటే హీనంగా తయారయ్యారు. అయ్యా ముఖ్యమంత్రిగారూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి.- రాజేంద్రప్రసాద్, పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ గౌరవ అధ్యక్షుడు

రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మాకన్నా ఈరోజు వాలంటీర్లకే ఎక్కువ అధికారులు ఉన్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం. ఇది సర్పంచ్‌ల ఆత్మగౌరవాన్ని, ఆత్మభిమానాన్ని కాలరాసినట్లే. కాబట్టి ఈ వాలంటీర్ల, సచివాలయాల వ్యవస్ధను సర్పంచ్‌ల ఆధీనంలోకి తీసుకురావాలి.- లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, సర్పంచ్‌ల సంఘం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.