AP Panchayati Raj Chamber Meeting on Telangana Elections Results 2023 : తెలంగాణలో గ్రామ సర్పంచులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి హెచ్చరించారు. అనంతపురంలో పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గ్రామ సర్పంచిలను నిర్వీర్యం చేశారని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో సర్పంచికి విలువ లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ తరహాలోనే తెలంగాణలో కేసీఆర్ కూడా సర్పంచులకు కనీస గౌరవం లేకుండా చేయటం వల్లనే, పట్టణాలు, నగరాల్లో ఓట్లు వచ్చినా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీని ఆదరించారని మునిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో ఇదే పరిస్థితి రానుందని ఆయన హెచ్చరించారు.
వై నాట్ ఆంధ్రా ! కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ జగనేనా ? వైసీపీ నేతల్లో గుబులు
AP Sarpanches on BRS Defeat : గ్రామాల్లో తాగునీటి బోరు చెడిపోయినా రిపేరు చేయించలేని దుస్థితిలో తాము ఉన్నామని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు భూషణం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి వచ్చిన నిధులు అన్నీ జగన్ మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నారని, దీనివల్ల గ్రామాల్లో సమస్యలు తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
AP Sarpanches Warning to AP CM Jagan : పంచాయతీ కార్యాలయంలో సర్పంచికి కూర్చోటానికి కుర్చీ కూడా లేకుండా తీవ్ర అవమానానికి గురి చేసిన సీఎంగా జగన్ నిలిచిపోయారని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఈ నెల ఒకటి నుంచి ఇంటింటికి సర్పంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేతలు చెప్పారు. దీనిలో భాగంగా జోనల్ వారీగా సర్పంచుల సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15న కడపలో నిర్వహించనున్న సర్పంచుల సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు నేతలు తెలిపారు.
CM KCR Resigned : రాజ్‌భవన్‌కు కేసీఆర్ - ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
Panchayati Raj Chamber Meeting in Anakapalle District : సీఎం జగన్‌ను ఓడించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిపిస్తేనే రాష్ట్రంలో పంచాయతీలకు మనుగడ అని, లేదంటే పంచాయతీ వ్యవస్థను మరిచిపోవాల్సిందేనని సర్పంచులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల ఛాంబర్ అధ్వర్యంలో సర్పంచుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఛాంబర్ జిల్లా అధ్యక్షుడు దాడి ఎరుకునాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ నెలలో చంద్రబాబు శ్రీకాకుళం వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.