అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మలక వేముల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పట్నం గ్రామానికి చెందిన అశోక్ ముదిగుబ్బ వెళ్తుండగా వాహనం ఇంజన్ వేడెక్కింది. రహదారి పక్కన నిలపటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భయపడిన యువకుడు అక్కడి నుంచి దూరంగా వచ్చాడు. నిమిషాల వ్యవధిలో వాహనం కాలిపోయింది. ఎండలో వాహనాన్ని నడపటం వల్ల ఇంజన్ వేడెక్కి బైక్ కాలిపోయినట్టు బాధితుడు వాపోయాడు.
ఇది కూడా చదవండి.