అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనం కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మడకశిర నియోజకవర్గంలో రెండో రోజు పంపిణీలో మార్పు కనిపించడం లేదు. ఇవాళ ఉదయం పలు గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం తరలివచ్చారు. విత్తనాలు సరిపడనంతా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం, విత్తన పంపిణీ గోదాముల వద్ద ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన వ్యవసాయశాఖ ఏడీతో వాగ్వాదానికి దిగుతున్నారు. వారాల తరబడి విత్తన వేరుశెనగ కోసం తిరుగుతుంటే విత్తనం పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి....