అనంతపురం నగర శివారులోని ఓ మెకానిక్ షెడ్డులో బాలుడు పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రెండవ పట్టణ సీఐ జాకిర్ హుస్సేన్ బృందం.. అక్కడికి వెళ్లింది. బాలుడితో పనిచేయిస్తున్న యజమానిని పోలీసులు హెచ్చరించారు.
పిల్లలతో పని చేయిస్తే బాల కార్మిక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎక్కడైనా దుకాణాల్లో, ఫ్యాక్టరీలలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: