అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ ఏప్రిల్ 25న ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి ఆసుపత్రిలో చేరింది. తలకి గాయమైందని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు మొదట తెలిపారు. సాధారణ చికిత్స తోనే కాస్త కోలుకున్నాక ఆపరేషన్ అవసరం లేదని తెలిపారు. అప్పటి వరకు బాగానే రాజమ్మ.. డిశ్చార్జ్ చేసే నర్సు తప్పిదంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి పట్ల వైద్యులు పొంతన లేని సమాధానాలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రి వద్దకు వచ్చి రాజమ్మ బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో నిరసన విరమించారు.
ఇవీ చదవండి