అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అధికారులు అప్రమత్తత చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నల్లచెరువు మండలం పాలపాటిదిన్నెలో ప్రమాణాల దేవుడుగా పేరుగాంచిన ఆంజనేయస్వామి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేటి నుంచి ఆగస్టు 13 వరకు స్వామివారి దర్శనం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రావణ మాసంలో పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్థం శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడిపేది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్నందున స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తూ దర్శనాలు నిలిపివేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి చాగళ్లు జలాశయం కుడికాలువ నుంచి వృథాగా పోతున్న నీరు