జూలై 25 కు టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు మురళి పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు బ్యాంకు అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశానని చెప్పారు. ఐదు కోట్ల డిపాజిట్లు ఉన్న బ్యాంకును 98 కోట్ల డిపాజిట్ కి తెచ్చానని తెలిపారు. బ్యాంకుకు సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
అవినీతి ఆరోపణలు జరిగినట్లు చూపిస్తే ఏ శిక్ష విధించిన తనకు సమ్మతమేనని చెప్పారు. అధ్యక్ష పదవికి పోటీ చేయనని చెప్పానని అయితే కక్ష సాధింపు పాలకుల చేతుల్లోకి వెళ్ళకూడదని ఉద్దేశంతో మళ్లీ ఈ పదవికి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇన్ని రోజులు బ్యాంకు అభివృద్ధికి సహకరించిన ఖాతాదారులు డిపాజిటర్లు బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది చదవండి జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్