ETV Bharat / state

జిల్లాలో పైలెట్​ ప్రాజెక్టుగా..భూగర్భ మురుగునీటి వ్యవస్థ - అనంతపురం జిల్లా లెటెస్ట్ న్యూస్

అనంతపురం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను...జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విధానంపై దిల్లీకి చెందిన వ్యాప్ కాస్ అనే సంస్థ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం కలెక్టరేట్​లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొని పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

Anatapuram district development review
Anatapuram district development review
author img

By

Published : Nov 2, 2020, 5:01 PM IST

Updated : Nov 2, 2020, 9:45 PM IST

అనంతపురం జిల్లా కలెక్టరేట్​లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా మంత్రి బొత్స అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఎమ్మెల్యేలు పలు శాఖల్లో ఎదురవుతున్న సమస్యలు, లోపాలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాను సమావేశానికి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు మీడియా ప్రతినిధులను ఆందోళన విరమించి వెళ్ళిపోవాలని సూచించారు. తాము ఆందోళనకారులు కాదని ఎందుకు పంపాలని చూస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం అక్కడినుంచి పోలీసులు వెనుదిరిగారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన కొనసాగింది.

ప్రజలకు సేవలందించే ప్రభుత్వ శాఖల అధికారుల నిర్లక్ష్యాన్ని అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పుబట్టారు. ప్రజా సమస్యలపై ఫోన్లు చేస్తే జిల్లా అధికారులు చాలామంది ఫోను తీసి సమాధానం చెప్పే పరిస్థితిలేదని ఎమ్మెల్యేలు మంత్రి బొత్స సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యుత్ శాఖ 2017 నుంచి విద్యుత్ నియంత్రికలు అమర్చటంలేదని, 65 వేల నియంత్రికలు ఎప్పుడూ అమర్చుతారో చెప్పాలని ఎమ్మెల్యేలు ఎస్ఈని నిలదీశారు. వివిధ శాఖల అధికారులు తాము చేసిన అభివృద్ధిపై నివేదిక చదువుతుండగానే పలువురు ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఈసారి పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ, ఏ చెరువులకు ఎంత నీరిచ్చారో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

జలవనరులశాఖ అధికారుల తీరు ఏమాత్రం మారటంలేదని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లిన రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, కరోనా సమయంలో నర్సింగ్ హోంలు దోచుకున్నాయని ఎమ్మెల్యేలంతా మంత్రి బొత్సకు చెప్పారు. నర్సింగ్ హోంలను కట్టడి చేయటానికి కమిటి ఏర్పాటు చేసి వెంటనే సమావేశం నిర్వహించేలా ఆదేశించినట్లు బొత్స తెలిపారు.

అనంతపురం జిల్లాలో పంట నష్టపోతున్న రైతులకు వాతావరణ బీమా ప్రయోజనంగా లేదని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ బీమాకు మరో పథకాన్ని తీసుకొచ్చేలా సమీక్షలో చేసిన ప్రతిపాదనపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2018 నాటి రూ.967 కోట్ల రూపాయల ఇన్​ఫుట్ రాయితీ మంజూరుపై విచారణ జరిపించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాడిమర్రి మండలంలో ఓ ఇంజినీర్ రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటానికి రూ.కోటి వసూళ్లు చేసి, కరోనాతో మృతి చెందారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై విచారణ చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని మంత్రి బొత్స ఆదేశించారు.

అనంతపురంలోని నగరపాలక సంస్థ, పురపాలికల్లో భూగర్భ మురుగునీరు పారుదల వ్యవస్థ ఏర్పాటుకు సర్వే జరపుతున్నామన్నారు. రాష్ట్రంలో జిల్లాను పైలెట్ ప్రాజక్టుగా తీసుకొని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే మూడు రోజులుగా జిల్లాలో వ్యాప్ కాస్ సంస్థ సర్వే నిర్వహిస్తోందన్నారు.

ఇదీ చదవండి : ఇంటర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే

Last Updated : Nov 2, 2020, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.