అనంతపురం జిల్లా హిందూపురం ఆబాధ్పేటలో మట్కా గ్యాంగ్ దందాను పోలీసులు అడ్డుకున్నారు. మట్కా నిర్వాహకుడిని, 9 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25,870 నగదుతో పాటు... నాలుగు ద్విచక్ర వాహనాలను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మట్కా సామాగ్రిని సైతం గుర్తించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: