అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 33 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. వాటిలోని సౌకర్యాలు పరిశీలిస్తున్నామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో అధికారులు పలు అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం ఒక్కటే కరోనా నివారణకు మార్గమని కలెక్టర్ అన్నారు. కరోనా అనుమానితుల నుంచి నమూనాల సేకరణకు 18 మొబైల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు 200 నమూనాలు సేకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికలు ఎప్పుడైనా.. సిద్ధంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్