గ్రామ, వార్డు సచివాలయ పోటీ పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. అనంతపురంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మీడియాకు వివరాలిచ్చారు. జిల్లాలో 12 కేటగిరీల సచివాలయ ఉద్యోగాలకు ఆన్ లైన్ద్వారా లక్ష 74వేల 810 మంది దరఖాస్తు చేసుకున్నట్లు...జిల్లా వ్యాప్తంగా మౌలిక సదుపాయాలున్న 389 కళాశాలల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పోటీ పరీక్ష నిర్వహణ కోసం ఏడు వేల 735 మంది సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారన్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు తాగునీరు వంటి సౌకర్యాలు కల్పంచనున్నామని కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి: స్పెయిన్: టమాటాలతో సరదా యుద్ధం