అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌరీపురం గ్రామం వద్ద రాష్ట్ర సరిహద్దు పోలీస్ చెక్ పోస్ట్ తనిఖీలో పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. పావగడ నుంచి శిర ప్రాంతానికి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సులో.. ఈ ఉత్పత్తులను పోలీసులు గుర్తించారు.
నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో 26 వేల రూపాయల విలువ చేసే 3264 పాకెట్ల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్, క్లీనర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: