ETV Bharat / state

అనంత ఉపాధ్యాయుడి సూక్ష్మకళ.. అవార్డుల వెల్లువ - సూక్ష్మకళాతో ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న అనంతపురం వ్యక్తి రాజేష్

కాదేదీ కళకు అనర్హం అని నిరూపిస్తున్నాడు అనంతపురానికి చెందిన ఓ యువకుడు. ప్రైవేట్ సంస్థలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నాడు. పెన్సిల్​పై కళాకృతులు రూపొందిస్తూ ఆదాయాన్నీ పొందుతున్నాడు. సూక్ష్మ కళపై ఖాళీ సమయాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ వారిని కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడు.

anantapuram teacher creating records with micro arts
సూక్ష్మకళతో అద్భుతాలు సృష్టిస్తున్న అనంతపురం ఉపాధ్యాయుడు రాజేష్
author img

By

Published : Jan 17, 2021, 7:10 PM IST

సూక్ష్మరూప కళాకృతులను తీర్చిదిద్దడానికి కృషితో పాటు ఓర్పు ఎంతో అవసరం. పెన్సిల్‌ లెడ్లపై ఆకృతులు వేయడం అనేది అంత సులభమైన వ్యవహారం కాదు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన పుటకాల రాజేష్ అనే ప్రైవేట్ సంస్థ ఉపాధ్యాయుడు మాత్రం.. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే పెన్సిళ్లపై సూక్ష్మ కళాకృతులకు ప్రాణం పోస్తున్నాడు. 2014లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కళాకారుడి ద్వారా దీనిపై అవగాహన పెంచుకున్న రాజేష్.. ఇప్పుడు పెన్సిళ్లపై అద్భుతమైన కళాఖండాలకు రూపాన్ని ఇస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే కళాకృతులకు ప్రాణం పోస్తున్నాడు.

artist rajesh with world record
ప్రపంచ రికార్డుతో రాజేష్

ఇదీ రాజేష్ నేపథ్యం..

అనంతపురం నగరంలోని రాజీవ్ నగర్​కు చెందిన రాజేష్.. 2018లో బీకాం పూర్తి చేశాడు తరువాత స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. విధులు నిర్వహిస్తూనే సూక్ష్మ కళపై దృష్టి సారించాడు. మొదట్లో పెన్సిల్ లెడ్​పై వ్యక్తుల పేర్లు, చిన్న చిన్న ఆకృతులు వేయడం సాధన చేశాడు. తరువాత ప్రత్యేక రోజుల విశిష్టతను తెలియజేస్తూ ఆకృతులు రూపొందించడం మొదలుపెట్టాడు. రాజేష్ రూపొందించిన వాటిలో వివిధ దేవతా రూపాలు, అమ్మ నాన్న చేతులను పట్టుకున్న పిల్లాడి రూపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానికంగా వీటికి మంచి ఆదరణ లభించడంతో.. కళాకృతులను విక్రయించడమూ ప్రారంభించాడు. ఒక్కో ఆకృతినీ రూ. 200 నుంచి రూ. 500 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెబుతున్నాడు.

micro artist with award
తనకు వచ్చిన అవార్డును చూపుతున్న కళాకారుడు

ప్రపంచ రికార్డు దాసోహం..

సూక్ష్మ కళాకృతులు రూపొందించడం ద్వారా ఆదాయంతో పాటు అవార్డులనూ రాజేష్ సొంతం చేసుకుంటున్నాడు. పెన్సిళ్లపై భారత జాతీయ గీతాన్ని రూపొందించి ప్రపంచ రికార్డు సాధించాడు. 12 పెన్సిళ్లపై 9 గంటల్లో జాతీయ గీతాన్ని రూపొందించినందుకుగానూ ఉత్తరప్రదేశ్​కు చెందిన లేదా ఫౌండేషన్ అనే సంస్థ ఈ రికార్డును ప్రధానం చేసింది. సూక్ష్మ కళపై తనకున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, సోదరులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని రాజేష్ చెబుతున్నాడు. వారి సహకారంతోనే ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మైక్రో ఆర్ట్​పై దృష్టి పెట్టగలుగుతున్నానని పేర్కొన్నాడు.

national anthem on pencil leads
పెన్సిల్ మొనలపై రూపొందించిన జాతీయ గీతం

గిన్నిస్ రికార్డే లక్ష్యం:

ప్రస్తుతం పెన్సిళ్లతో పాటు బియ్యపు గింజపై సూక్ష్మ కళాకృతులు రూపొందించేలా సాధన చేస్తున్నట్లు చెబుతున్న రాజేష్.. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చదవండి:

'కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.