ETV Bharat / state

సైబర్ నేరాల బారిన పడితే మా సాయం తీసుకోండి: ఎస్పీ

తిరుపతిలో జరుగుతున్న 63 వ ఏపీ పోలీస్ రాష్ట్ర స్థాయి మొట్ట మొదటి డ్యూటీ మీట్​లో... మహిళలపై సైబర్ నేరాలు అంశంపై జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడారు. మహిళలు సైబర్​ నేరగాళ్ల బారిన పడినప్పుడు వెంటనే పోలీసుల సాయం పొందాలని సూచించారు. తమను ఆశ్రయించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

poloice meet speech by sp
జిల్లా ఎస్పీ ఉపన్యాసం
author img

By

Published : Jan 7, 2021, 6:00 AM IST

మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు భరోసా ఇచ్చారు. తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్న 63 వ ఏపీ పోలీస్ రాష్ట్ర స్థాయి మొట్ట మొదటి డ్యూటీ మీట్​లో భాగంగా" మహిళలపై సైబర్ నేరాలు" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు.

పరువు పోతుందనే భావనతో సాధారణంగా మహిళలు ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడానికి సంకోచిస్తుంటారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నితమైన విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ప్రస్తుతం కొందరు మహిళలు, బాలికలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని.. బాధితులుగా మారకుండా ఉండేందుకు సైబర్ హైజీన్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

నేరుగా పోలీస్ స్టేషన్​కు రాలేని బాధితులు ఏపీ పోలీస్ సేవ యాప్, సైబర్ మిత్ర, డయల్ 100, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్​ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సైబర్ బాధితులు ఎంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంత సురక్షితంగా ఉండగలరని గుర్తించాలన్నారు. ప్రస్తుతం మహిళలపై సైబర్ నేరాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని.. త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:

'సాంకేతికత ద్వారా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.