అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని కదిరేపల్లితో పాటు గుడిబండ మండల కేంద్రంలోని 1వ గ్రామ సచివాలయాన్ని.. కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూగుల్ మ్యాప్‌లో గుడిబండ 1 సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా అని ఆరా తీసి.. రిజిస్టర్లను పరిశీలించారు.
సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు సచివాలయం ద్వారా ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి, ఎన్నింటికి పరిష్కారం చూపించారు అని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చదవండి: