అనంతపురం జిల్లా గుంతకల్లులో రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. రెడ్‌జోన్‌లో తీసుకుంటున్న చర్యలను స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంతకల్లు మండలం కసాపురం వద్ద ఉన్న అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసుల విధులకు ఎవరైనా భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. గుంతకల్లులో పోలీసులు మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆ గ్రామంలో వెండి నాణేలు దొరుకుతున్నాయ్..!