అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు ఇంటూరి రామాంజనేయులు తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి రైతులు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరరాక, అప్పులు భారం తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.
రైతు మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి : బోరుమనిపిస్తున్న బోర్లు...అనంతలో అన్నదాతల ఆత్మహత్యలు!