అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం బనాన్ చెరువు పల్లి గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై విద్యుత్ శాఖ ఏఈ గ్రామంలో పర్యటించి స్థానిక అధికారిని ప్రశ్నించారు. గ్రామంలో నివాసాల గోడలకు సైతం విద్యుత్ సరఫరా అవుతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి