అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో... జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హిందూపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కోవిడ్ -19 పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పట్టణంలోని లాక్డౌన్ బందోబస్తును పరిశీలిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రెడ్ జోన్ ప్రాంతాల్లో వాహనాలతో ప్రదర్శనగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకి వచ్చిన ద్విచక్ర వాహనాలను ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైగా సీజ్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి ఆసక్తికరమైన వార్తలు @7PM