అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన వన్నూరుస్వామి అనే రైతు చేసిన అప్పును తీర్చలేక తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం రూ. 6 లక్షలకు పైగా అప్పు చేసినట్లు మృతుని కుమారుడు శివశంకర్ తెలిపారు. అప్పును తీర్చలేక మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య - అనంతపురంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక వన్నూరుస్వామి అనే రైతు తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.