ETV Bharat / state

కరవు సీమలో రికార్డు స్థాయిలో వర్షాలు - rains in ananatapur district news

అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో మూడు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేరుసెనగ పంటకు వర్షాలు మేలు చేకూరుస్తాయని కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.... పంట పొలాలు నీట మునిగి మరికొందరు కర్షకులకు కన్నీరు మిగిలింది.

Anantapur district received record rainfall
కరవు సీమలో రికార్డు స్థాయిలో వర్షాలు
author img

By

Published : Sep 4, 2020, 11:32 AM IST

కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు విస్తారంగా వేరుసెనగ పంట సాగు చేశారు. అయితే జులై మొదటి వారం వరకు సాగు చేసిన వేరుసెనగ పంట అధిక వర్షాలకు దెబ్బతింది. అయితే జులై ద్వితీయార్థంలో సాగు చేసిన పంటలు మాత్రం వర్షం లేక ఎండుముఖం పట్టాయి. ఆగస్టు నెలలో దాదాపు మూడు వారాలు వర్షం అన్నదే కనిపించలేదు. దీనికి తోడు ఎండలు కూడా ఎక్కువ కావటంతో పంట దెబ్బతినే పరిస్థితి కనిపించింది. మూడు వారాలుగా వర్షాల కోసం చూస్తున్న రైతులకు ఊరట కలిగించే విధంగా మూడు రోజుల నుంచి సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 39మండలాల్లో వర్షాలు కుండపోతగా కురవటంతో వేరుసెనగ పంట మళ్లీ జీవం పోసుకుంది. ఎండు ముఖం పట్టిన పంట పచ్చగా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్షపాతం ఇలా...

ఈ ఖరీఫ్ సీజన్ నుంచి నమోదైన వర్షపాతాన్ని ‍ఒక్కసారి పరిశీలిస్తే... జూన్ నెలలో 67శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే జులై నెలలో ఏకంగా 147శాతం అధిక వర్షం కురిసింది. ఆగస్టు నెలలో మాత్రం వర్షం ముఖం చాటేయటంతో 36శాతం లోటు వర్షపాతం నమోదైంది. కానీ ఆగష్టు 31 నుంచి ఈనెల 2వ తేదీ వరకు రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. గత మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల మినహా అన్ని చోట్లా వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం రాత్రి రొళ్లలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల మడకశిర ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అలాగే మంగళవారం రాత్రి కుందుర్పిలో 97మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులకు చాలా ఉపయోగపడుతాయని అనంతపురం సీపీఓ ప్రేమచంద్ర వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

జిల్లాలో కొన్ని చోట్ల అధిక వర్షాలు రైతుల కష్టాన్ని మింగేశాయి. రొళ్ల, మడకశిర ప్రాంతాల్లో వేరుసెనగతో పాటు పలు రకాల పంటలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.