ETV Bharat / state

"18 ఏళ్లు నిండని వారికి పరిహారం ఇవ్వం" - సీబీఆర్ ప్రాజక్టు ముంపు బాధితుల పరిహారం

అనంతపురం జిల్లా మర్రిమాకులపల్లిలో సీబీఆర్ ప్రాజెక్టు ముంపు బాధితుల పరిహారంపై కలెక్టర్​ గంధం చంద్రుడు స్పందించారు. 2006 నాటికి 18 ఏళ్లు నిండని యువతకు పరిహారం ఇవ్వలేమని కలెక్టర్ స్పష్టం చేశారు.

Anantapur Collector's response on compensation for flood victims of CBR project
కలెక్టర్​ గంధం చంద్రుడు
author img

By

Published : Nov 1, 2020, 12:05 PM IST

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో 2006 తరువాత 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వలేమని కలెక్టర్​ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తాడిమర్రి మండలంలో సీబీఆర్ ప్రాజక్టు ముంపు బాధితులైన యువతకు పరిహారం చెల్లించలేమన్నారు. మర్రిమాకులపల్లి గ్రామంలో గతంలో ఇవ్వలేకపోయిన 119 మంది ఎస్సీలతో పాటు, అర్హులైన మరో 110 మందికి మాత్రమే త్వరలో పరిహారం ఇస్తామని చెప్పారు.

ఆ గ్రామంలో ఉన్న 110 మందికి... 2006 నోటిఫికేషన్ తరువాత 18 ఏళ్లు నిండాయని, అందువల్ల పరిహారం ఇవ్వడానికి వీలులేదన్నారు. గతంలో కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే ప్రాజెక్ట్​లో నీటిని నిల్వ చేసేవారని, ఈసారి పది టీఎంసీలు నిల్వచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. అందువల్లే మర్రిమాకుల పల్లి గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా పరిహారం కావాలని ఆందోళన చేస్తే కుదరదని కలెక్టర్​ స్పష్టం చేశారు. గ్రామంలో కొనసాగుతున్న అధికారుల దాష్టీకంపై కలెక్టర్ గంధం చంద్రుడు దాటవేశారు. కలెక్టర్​ వ్యాఖ్యలతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.