అనంతపురం జిల్లా సిద్దరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోర్డుపై రాసి విద్యార్థులకు వివరించారు.
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయులకు తక్కువగానే వైరస్ లక్షణాలు ఉన్నాయన్నారు. విద్యార్థులతో కలసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
ఇదీ చదవండి: