అనంతపురం నగరంలో కర్ణాటకకు చెందిన గోవిందానంద స్వామీజీ బృందం ఆనందయ్య మందును పంపిణీ చేసింది. నగరంలోని 44వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి మందును అందించింది. కృష్ణపట్నంలో మూడు రోజులపాటు మందు తయారు చేసే విధానాన్ని పరిశీలించినట్టు స్వామీజీ చెప్పారు.
ఆ తర్వాతే ఆనందయ్య మందును అనంతపురంలో పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. సుమారు 500 కుటుంబాల నుంచి 1000 మందికి సరిపడా మందులు పూర్తి ఉచితంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇంటింటికీ వెళ్లి మందు వాడే విధానాన్ని తెలుపి.. పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
అసత్య ప్రచారాలు చేస్తున్నారు..
ఆనందయ్య మందు ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధమని.. కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మందును ప్రజలకు ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు ఆనందయ్య చెప్పారని అన్నారు. ఆనందయ్య మందు తయారీకి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు.
ఇదీ చదవండి: