ETV Bharat / state

అనంతలో ఆగని వేరుశనగ రైతుల నిరసనలు - seeds

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సబ్సీడీ వేరుశనగ విత్తన పంపిణీ చేయలంటూ రైతులు రాస్తారోకో చేశారు.

అనంతలో ఆగని వేరుశనగ రైతుల నిరసనలు
author img

By

Published : Jun 28, 2019, 4:58 PM IST

అనంతలో ఆగని వేరుశనగ రైతుల నిరసనలు

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతుల ఆందోళనలు ఆగలేదు... గుత్తి పట్టణంలో సబ్సీడీ వేరుశనగ విత్తన పంపిణీ చేయలంటూ రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. వ్యవసాయ ఆధికారులు విత్తన పంపిణీలో జాప్యం వహిస్తున్నారంటూ మండల పరిధిలోని తొండపాడు, కొత్తపేట గ్రామాలకు చెందిన రైతులు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గత వారం రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్​కు వస్తున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. వర్షాలు పడుతున్నా విత్తనాలు అందనందున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు, రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. వ్యవసాయ అధికారులు స్పందించి ధర్నాకు వచ్చిన రైతులకు ఖచ్చితంగా వేరుశెనగ విత్తనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. స్టాకు లేకపోవడం వల్లే అన్ని గ్రామాల రైతులకు విత్తనం పంపిణీ చేయలేకపోతున్నామని తెలిపారు.

ఇదీ చదవండి

37 మంది డీఎస్పీల బదిలీ

Intro:స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Body:ఉదయగిరి లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రూ.25 లక్షలతో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అదే భవనంలో లో మండలం అధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ఇక నుంచి జరిగే అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు వివరించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే గా తాను చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారంటూ ఆర్ఐ సురేంద్ర, విఆర్ఓ మాలకొండయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఉండి ఇబ్బంది పడకుండా ఉండాలంటే బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలంటూ సూచించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో లో పార్టీ లకు అతీతంగా ప్రజలందరూ తమ వాళ్లనే విధానంతో పరిపాలన అందించిన గొప్ప మానవతావాది వైయస్ రాజశేఖర్రెడ్డి అన్నారు. పరిపాలన విధానాన్ని బట్టి పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు చేశారు. వారు అమలు చేసిన జన్మభూమి కమిటీలే ఆ పార్టీని తుడిచి పెట్టుకుని పోయేలా చేశాయంటూ విమర్శలు చేశారు. ఎంపీటీసీల పదవి కాలం ముగుస్తుండడంతో సమావేశానికి హాజరైన ఎంపీపీ తో పాటు ఎంపీటీసీ లను మెమోంటోలను అందజేసి సన్మానించారు.

Conclusion:స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.