ఇదీ చదవండి:
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పరిరక్షణ సభ్యుల జలదీక్ష - Amravati to continue as AP capital news
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. అనంతపురం జిల్లా కదిరిలో పరిరక్షణ సమితి సభ్యులు జల దీక్ష చేపట్టారు. 49 రోజులుగా రాజధాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 13 జిల్లాల వాసులు అమరావతిని తమ రాజధానిగా భావించి రాజధాని నిర్మాణానికి తమ వంతు సహాయం అందించాలన్నారు. రైతుల త్యాగాలను హేళన చేస్తున్న అధికార పార్టీ నాయకుల బుద్ధి మారాలని.. జల దీక్ష చేపడుతున్నట్లు సభ్యులు తెలిపారు.
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ..జలదీక్ష