ETV Bharat / state

కరోనా: కొత్త బాధితుల్లో తహసీల్దార్, ఇద్దరు వైద్యులు - ఒక తహసీల్దార్, ఇద్దరు వైద్యులు ఉన్నారని కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు

అనంతపురం జిల్లాలో తాజాగా ఒక్కరోజే మరో ఆరుగురికి కరోనా ప్రబలింది. వారిలో ఒక తహసీల్దార్, ఇద్దరు వైద్యులు ఉన్నారని కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు.

ananthapuram district
బాధితుల్లో తహసీల్దార్, ఇద్దరు వైద్యులు
author img

By

Published : Apr 15, 2020, 4:13 PM IST

అనంతపురంలో ‘కరోనా’ కలవరపెడుతోంది. తాజాగా ఒక్కరోజే మరో ఆరుగురికి ప్రబలింది. వీరితో కలిపితే జిల్లాలో ఇప్పటి దాకా మొత్తం 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని మంగళవారం కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న జనరల్‌ ఫిజీషియన్‌, వైద్య కళాశాల మైక్రోబయాలజీ వైద్యురాలు, హిందూపురంలో నివాసం ఉన్న ఓ తహసీల్దార్, తహసీల్దార్‌తో పరిచయం ఉన్న వ్యక్తి , హిందూపురానికి చెందిన యువతి , యువకుడికి మహమ్మారి సోకింది.

ఎవరు ఎక్కడెక్కడ

మొత్తం 21 మందిలో... సర్వజన ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉండగా... లేపాక్షి, కళ్యాణదుర్గం, కొత్తచెరువుకు సంబంధించి ఒక్కొక్కరు, మిగిలిన 11 మంది హిందూపురం పట్టణం వారే ఉన్నారు. వీరిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మిగిలిన 19 మందిలో ఇద్దరు పురంలో ఉండగా... మిగతా వారు సర్వజన ఆస్పత్రి, సవేరా ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు.

తహసీల్దార్‌తో అలజడి

హిందూపురంలో నివాసం ఉన్న ఓ తహసీల్దార్‌ ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో పని చేస్తున్నారు. తహసీల్దార్‌కు పాజిటివ్‌ రావటంతో ఆ ప్రాంత అధికారుల్లో అలజడి రేగుతోంది. సదరు అధికారి హిందూపురం నుంచి మడకశిర ప్రాంతానికి రాకపోకలు సాగించారు. ప్రజా సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కొందరు ప్రజాప్రతినిధులతోనూ, జిల్లా అధికారులతోనూ కలిశారు. ఎవరెవరితో కలిశారు. ఎక్కడ తిరిగారన్న దానిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

జేసీకి ముందస్తు నమూనా

జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావు ఇటీవల మూడు దఫాలు హిందూపురానికి వెళ్లొచ్చారు. ఆ ప్రాంత తహసీల్దార్, ఇతర అధికారులతో సమీక్షలు జరిపారు. తాజాగా ఓ అధికారికి పాజిటివ్‌ రావడంతో ముందస్తుగా జేసీ కూడా నమూనా ఇచ్చారు. ఇదే దారిలో మరికొందరు అధికారులు నమూనాలు ఇవ్వడానికి సమాయత్తం అయ్యారు. మడకశిర ప్రాంతానికి చెందిన తహసీల్దార్లు, ఇతర అధికారులు నమూనాలు ఇవ్వాలని సంకల్పించారు.

నమూనాలకు ‘ఆధార్‌’

కరోనా అనుమానితుల నుంచి తీస్తున్న నమూనాలకు ‘ఆధార్‌’ సంఖ్యను అనుసంధానం చేయాలని సంకల్పించారు. ఇక నుంచి విధిగా కేసు పరిశోధన పత్రంలో (సీఐఎఫ్‌) నమోదు చేయాలని జేసీ డిల్లీరావు ఆదేశించారు. సదరు పత్రాన్ని భర్తీ చేసేటప్పుడు ఆధార్‌ సంఖ్యను రాయాలి. లేదంటే.. నమూనా ఫలితాల నమోదులో ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన సూచించారు. ఇదే విషయాన్ని నమూనాల సేకరణ వైద్యులకు సూచించారు.

మూడో రోడ్డులో అప్రమత్తం

మూడోరోడ్డులోని కొంత ప్రాంతానికి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. మూడోరోడ్డులో నివసిస్తున్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబొరేటరీలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మూడోరోడ్డులోని కొంత ప్రాంతానికి బారికేడ్లు ఏర్పాటు చేయడానికి మంగళవారం మూడో పట్టణ సీఐ రెడ్డప్ప పరిశీలించారు. రోడ్డులో రాకపోకలను నిషేధించనున్నారు. ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.

ఇదీ చదవండి:

ఇంకుతున్న భూగర్భ జలాలు.. తాగునీటికి గ్రామీణుల ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.