అనంతపురం జిల్లాలో అంబులెన్స్ బోల్తా పడింది. అగళి మండలానికి చెందిన అంబులెన్స్ వాహనంలో.. వైద్యుల సిఫారసు మేరకు రోగులను మడకశిర ఆసుపత్రి నుంచి హిందూపురం ఆసుపత్రికి తరలించారు. తిరిగి వస్తుండగా మడకశిర మండలం బుళ్లసముద్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా వాహన పైలట్, ఈఎంటీలు బయటపడ్డారు.
ఇదీ చదవండి: