అనంతపురం జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీల్లో ఓటు హక్కుపై ఓటర్లలో ఆందోళన నెలకొంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలో పది టీఎంసీల నీటిని నిల్వచేశారు. ఫలితంగా తాడిమర్రి మండలంలోని సీసీ రేవు పంచాయతీలోని సీసీ రేవు, మర్రిమాకుల పల్లి గ్రామాలతో పాటు, ముదిగుబ్బ మండలంలోని బోధనంపల్లి పంచాయతీలో ఉన్న రాఘవపల్లి, పీసీ రేవు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఎస్ఈసీ అనుమతి లభిస్తేనే...
ముంపునకు గురవుతున్న మర్రిమాకుల పల్లి, సీసీ రేవు, రాఘవపల్లి గ్రామాల్లోని 2,900 మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిని ఏ పంచాయతీలో విలీనం చేయాలి అనే అంశంపై... జిల్లా కలెక్టర్‌తో ధర్మవరం ఆర్డీఓ చర్చించారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఎస్ఈసీకి లేఖ రాశారు. ఎస్ఈసీ అనుమతి లభిస్తే ఫిబ్రవరి 4 నుంచి మొదలయ్యే రెండో విడత ఎన్నికల్లో ఈ గ్రామాలకు చెందిన వారికి ఓటుహక్కు వస్తుందని అధికారులు తెలిపారు.
ఇదీచదవండి.