ETV Bharat / state

ఘనంగా.. అంబేడ్కర్ జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా డా. బీఆర్​ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనేక చోట్ల నేతలు, ప్రజా సంఘాలు, దళితులు మహనీయుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం నిలిచిన రాజ్యాంగ రూపకర్త మార్గంలో అందరూ నడవాలని ఆకాంక్షించారు.

అంబేడ్కర్ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి
author img

By

Published : Apr 14, 2021, 4:08 PM IST

మడకశిర పట్టణంలో డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలను వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

హిందూపురంలో భాజపా యువసేన, తెదేపా నేతలు అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైకాపా పార్లమెంటరీ ఇన్​ఛార్జ్​ నవీన్​ కేక్​ కట్​ చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అనుచరులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ చిత్ర పటానికి క్రేన్​తో పూలమాల వేసి అంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను గుర్తు చేసుకున్నారు.

రాయదుర్గం పురపాలికలో మున్సిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప, కమిషనర్ జబ్బర్ నియా, ఇతర మున్సిపల్​ అధికారులు, ఉద్యోగులు, కౌన్సిలర్లు అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ మహనీయుని ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

ఎస్సీ, ఎస్టీల హక్కులను జగన్ పాలన కాలరాస్తోంది: చంద్రబాబు

పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.