రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్టు.. అమరావతి పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పాటయ్యాయి. అమరావతి పరిరక్షణ సమితిగా గౌరవ అధ్యక్షుడిగా తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్, కన్వీనర్‌గా జనసేన నాయకుడు భైరవ ప్రసాద్ నియమితులయ్యారు. అమరావతే రాజధానిగా ఉండేలా నియోజకవర్గ పరిధిలోని గ్రామస్థాయి నుంచి ప్రజలకు ఈ సమితి అవగాహన కల్పించనుంది.
ఇవీ చదవండి..