హిందూపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ఒకటో వార్డులో తెదేపా ఏజెంట్గా ఉన్న న్యాయవాది శివశంకర్.. హెడ్ టార్చ్ లైట్ వేసుకుని వినూత్న నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు సమయంలో.. కరెంట్ తీసివేసి వైకాపా గెలుపునకు సహకరించారని ఆరోపించారు. అందుకే ఈ రోజు మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో కరెంటు పోతే.. తాను హెడ్ టార్చ్ లైట్ ద్వారా అధికారులకు సహకరిస్తానని తెలిపారు. ఈ మేరకు తనకు అనుమతివ్వాలంటూ.. తలకు టార్చ్ లైట్ బిగించుకుని కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు ఆయన్ని అడ్డుకుని వెనక్కి పంపారు.
ఇదీ చదవండీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం