ETV Bharat / state

అనిశాకు చిక్కిన అనంతపురం పంచాయితీరాజ్ ఈఈ - acb raids latest news in ananthapur

అనంతపురం జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ ఈఈ సురేష్ రెడ్డి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు చేశారు. కర్నూలు జిల్లాల్లో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

వివరాలు సేకరిస్తున్న అనిశా డీఎస్పీ నాగభూషణం
author img

By

Published : Nov 15, 2019, 1:39 PM IST

అనిశాకు చిక్కిన అనంతపురం పంచాయితీరాజ్ ఈఈ

అనంతపురంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన మరో తిమింగళాన్ని అనిశా అధికారులు గుర్తించారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖలో సహాయ ఇంజనీర్​గా సురేష్​రెడ్డి పని చేస్తున్నారు. రామనగర్​​ కాలనీలోని అయన ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో రెండు చోట్ల బంధువుల ఇళ్లలో, కర్నూలు జిల్లా బేతంచెర్లలోని తన భార్య పుట్టింట్లో ఒకే సమయంలో సోదాలు జరిపారు. దాడులలో రూ.5లక్షల నగదు, 300 గ్రాముల బంగారు నగలు, వాణిజ్య సముదాయ భవనం, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని అనిశా అధికారులు చెప్పారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

ఇదీచూడండి.బయటపడుతున్న గూడూరు తహసీల్దార్ హసీనాబీ లీలలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.