అనంతపురం జిల్లా కదిరిలోని గాంధీనగర్‌కు చెందిన అల్లావుద్దీన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం అల్లావుద్దీన్ తన సోదరుడి కుటుంబంతో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని వదినకి చెల్లెలు అయిన యువతితో పులివెందులకు చెందిన బాబా చనువుగా వ్యవహరిస్తున్నాడు.
అక్క ఇంటికి (అల్లావుద్దీన్ ఉంటున్న ఇల్లు) వచ్చిన యువతిని బాబా తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అందుకు నిరాకరించిన ఆమెతో వాగ్వాదం జరిగింది. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన అల్లావుద్దీన్‌ను బాబా కత్తితో పొడిచాడు. గాయపడిన వ్యక్తికి రక్తస్రావం ఎక్కువై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని కదిరి అర్బన్ సీఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: సామరాయపాలెంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి