ETV Bharat / state

60 వేల అప్పుకు లక్ష వడ్డీ.. ఆపై పిడిగుద్దులు

అవసరం కోసం వ్యాపారి దగ్గర అప్పు చేశాడో వ్యక్తి. తీసుకున్న సొమ్ముకు లక్షకు మించి వడ్డీ కట్టాడు. ఇక వడ్డీ చెల్లించటం తనవల్ల కాదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన వ్యాపారి చితకబాదాడు.

author img

By

Published : Jul 20, 2019, 6:08 PM IST

నగదు
వడ్డీ కట్టలేదని చితకబాదారు

అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీ చెల్లించలేదని దారుణంగా కొట్టిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రాణినగర్​కు చెందిన వ్యక్తి ఓ వ్యాపారి వద్ద రూ.60 వేలు అప్పు చేశాడు. దీనికి వడ్డీ రూపంలో లక్ష రూపాయల వరకు చెల్లించాడు. ఇక వడ్డీ కట్టడం తన వల్ల కాదని వ్యాపారికి మొర పెట్టుకున్నాడు. దీంతో వ్యాపారి రెచ్చిపోయాడు. తన అనుచరులతో కలిసి వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అతని మిత్రులు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. దీనిపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రతాప్​రెడ్డి తెలిపారు. వడ్డీ వ్యాపారస్తులు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారని.. అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
మొబైల్ నం: 7032975449

Ap_Atp_46_19_Govt_Lands__Kabja_PKG_AP10004

Body:కొండలు , గుట్టలు, వాగులు వంకలు కావేవి కబ్జాకు అనర్హం అంటూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణము పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించుకున్నారు. కొండలను కూలుస్తూ వాగులను పూడ్చేస్తూ ప్రభుత్వ స్థలలాలను కబ్జా చేస్తున్నారు.Look
రోజురోజుకు విస్తరిస్తున్న కదిరి పట్టణంలో స్థలాల ధరలు రెక్కలు వచ్చాయి . దీనిని అదునుగా చేసుకున్న స్థిరాస్తి వ్యాపారులు పట్టణానికి నాలుగు వైపులా వెంచర్లు వేశారు. కొంత భూమిని కొనుగోలు చేయడం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకోవడం రివాజుగా మారింది.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల విధులలో అధికార యంత్రాంగం నిమగ్నమవడం కబ్జా దారులకు కలిసి వచ్చింది . ప్రధాన శాఖలకు ఉన్నతాధికారులు అందరూ కొత్త వారు కావడం వీరికి మరింత కలిసొచ్చింది. పేదలకు ఇంటి పట్టాలు పేరుతో కొన్ని రాజకీయపార్టీల నాయకులు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోని రెండు గుట్టలను చదును చేసేశారు. భారీ యంత్రాలతో గుట్టలను తొలిచేస్తున్నా...అధికారులు అటువైపు చూడలేదు . తొలగించిన ఆ బండరాళ్లను సమీపంలోని వంకకు తోలి పూడ్చేశారు. సుమారు మూడుకిలోమీటర్లు విస్తరించిన వంకను 90శాతం ఎక్కడికక్కడ స్థిరాస్తి వ్యాపారులు చదును చేసుకుని ఆక్రమించేశారు. ఇటీవల జరిగిన ఈ కబ్జాలతో లక్షల రూపాయలు చేతులు మారాయి.అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Conclusion:బైట్
మహమ్మద్ ఖాసీం, తహశీల్దార్, కదిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.